Praja Kshetram
తెలంగాణ

రాజకీయాలు వదిలేద్దామనుకున్నా.. కేటీఆర్‌ షాకింగ్ కామెంట్స్

రాజకీయాలు వదిలేద్దామనుకున్నా.. కేటీఆర్‌ షాకింగ్ కామెంట్స్

 

హైదరాబాద్ అక్టోబర్ 31 (ప్రజాక్షేత్రం): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన కామెంట్స్ చేశారు. సాయంత్రం 6గంలకు ట్విట్టర్(ఎక్స్)లో ‘‘ఆస్క్ కేటీఆర్’’లో పలు విషయాలను వెల్లడించారు. దయచేసి ఆస్క్ కేటీఆర్‌ను ఉపయోగించాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దామను కున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని స్పష్టంచేశారు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ప్రతిరోజు తమకు దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. 2025నుంచి కేసీఆర్ విశ్వరూపం చూస్తారని తెలిపారు. పార్లమెంట్‌కు వెళ్లడం కన్నా తనకు తెలంగాణలో ఉండడమే ఇష్టమని వివరించారు. ఇప్పుడు ఉన్న జీహెచ్ఎంసీ స్వరూపం ఎలా మారుతుందో తెలియదని అన్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవనం దేశంలోనే అతిపెద్ద స్కామని విమర్శించారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. హైడ్రా ఒక బ్లాక్ మెయిలింగ్ టూల్ అని ఆరోపించారు. హైడ్రాతో పేద మద్యతరగతి వారి ఇళ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. కానీ పెద్దవారి ఇండ్ల జోలికి ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని అన్నారు. త్వరలో మహిళా, విద్యార్థి కమిటీలు వేస్తామని ప్రకటించారు. విలువలు లేని రాజకీయాలు మనం చేయలేమని… అవి ఎక్కువ కాలం ఉండవని కేటీఆర్ స్పష్టం చేశారు.

Related posts