Praja Kshetram
క్రైమ్ న్యూస్

దీపావళి పండుగ పూట దారుణం.. బాలికపై నలుగురు మైనర్‌ బాలుర అత్యాచారం

దీపావళి పండుగ పూట దారుణం.. బాలికపై నలుగురు మైనర్‌ బాలుర అత్యాచారం

 

వికారాబాద్ అక్టోబర్ 31 (ప్రజాక్షేత్రం):దీపావళి పండుగ పూట రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు మైనర్ బాలురు కలిసి.. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని దోమ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కాగా గురువారం మైనర్ బాలిక కుటుంబ సభ్యులు దోమ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ బిడ్డపై నలుగురు మైనర్లు లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అత్యాచారం చేసిన నలుగురు మైనర్లను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts