Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి 

వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి

గుంటూరులో 26న మాల మహా గర్జన

అఖిల భారత మాల సంఘాల జె.ఎ.సి చైర్మన్ డాక్టర్

ఉప్పులేటి దేవి ప్రసాద్

విశాఖపట్నం, నవంబర్ 1(ప్రజాక్షేత్రం): రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహాగర్జన నిర్వహిస్తున్నట్టు అఖిల భారత మాల సంఘాల జె.ఎ.సి చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ చెప్పారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల మాల సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఎదురు బైబిల్ మిషన్ మైదానంలో ఈ నెల 26వ తేదీన మాల మహా గర్జన జరుగుతుందన్నారు. మాలల సామాజక స్పందన ప్రభుత్వానికి తెలియచేప్పాలన్నదే గర్జన లక్ష్యం అన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అనుసరించి వర్గీకరణ చట్టాన్ని ప్రభుత్వం చేయరాదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ శాసనం కాదని శాసన సభ మాత్రమే శాసనం చేయాలన్నారు. సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించిందని దాన్ని చట్టం చేయమని ఆర్డర్ ఇచ్చే అధికారం సుప్రీం కోర్టుకు లేదన్నారు. సుప్రీం కోర్టు గతంలో ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

Related posts