Praja Kshetram
క్రైమ్ న్యూస్

వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్‌ దొంగ అరెస్ట్

వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్‌ దొంగ అరెస్ట్

వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో తన బంధువులు… స్నేహితుల పేరుతో ఫేక్ ఐడిలు సృష్టించి లోన్ తీసుకున్నట్లుగా తన ఖాతాలోకి మేనేజర్ విశాల్ డబ్బు పంపుకున్నాడు. మొత్తం 63 ప్యాకెట్లలోని గోల్డ్ దాదాపు రూ.2కోట్ల 20లక్షల విలువైన గోల్డ్‌ను విశాల్ దొంగతనం చేశాడు.

వికారాబాద్ నవంబర్ 01(ప్రజాక్షేత్రం): వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ దొంగను పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచ్ మేనేజర్ విశాల్‌నే బంగారాన్ని దోచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మణప్పురం గోల్డ్‌లోన్ వికారాబాద్ బ్రాంచ్‌లో కస్టమర్లు దాచిన బంగారు వస్తువులు కనిపించడం లేదని అడిట్ అధికారులు గుర్తించారు. వికారాబాద్ మణప్పురం గోల్డ్‌లోన్ బ్రాంచ్ మేనేజర్ విశాల్‌పై అనుమానంతో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశాల్‌కు జలసాలతో పాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం అలవాటుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బీదర్ జిల్లా అవురద్ తాలుకా అనంతపురం గ్రామానికి చెందిన విశాల్ 2023నుంచి వికారాబాద్ బ్రాంచ్ మేనేజర్‌గా విశాల్ పని చేస్తున్నాడు. వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో తన బంధువులు… స్నేహితుల పేరుతో ఫేక్ ఐడిలు సృష్టించి లోన్ తీసుకున్నట్లుగా తన ఖాతాలోకి మేనేజర్ విశాల్ డబ్బు పంపుకున్నాడు. మొత్తం 63 ప్యాకెట్లలోని గోల్డ్ దాదాపు రూ.2కోట్ల 20లక్షల విలువైన గోల్డ్‌ను విశాల్ దొంగతనం చేశాడు. విశాల్‌ను అదుపులోకి తీసుకొని తన ఇంట్లో తనిఖీలు చేయగా 83గ్రాముల బంగారం, 10లక్షల నగదు స్వాధీనం చేసుకొని ప్రత్యేక టీం అదుపులోకి తీసుకుంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడు విశాల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related posts