తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన అఘోరి ఇష్యూ
మంచిర్యాల నవంబర్ 01 (ప్రజాక్షేత్రం): గత కొన్ని రోజులుగా తెలంగాణలో అఘోరి అలియాస్ శ్రీనివాస్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అఘోరి వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అఘోరి ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుశ్నపల్లిలో అఘోరి అలియాస్ శ్రీనివాస్‌ను గృహ నిర్భంధంలో ఉంచారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని అఘోరి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంచి పోలీసులు రెండంచెల బందోబస్తు నిర్వహిస్తున్నారు. అఘోరిని చూడటానికి పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.