ప్రాణం తీసుకున్న కరెంటు తీగలు
-ఆకుల కోసం చెట్టు ఎక్కి తిరిగిరాని లోకాలకు…
– చెట్టు పైన కరెంటు తీగలకు ఆనుకొని పిట్టలాగా పోయిన ప్రాణం
మొయినాబాద్ నవంబర్ 01 (ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మండల కేంద్రంలోని కనకమామిడి గ్రామ సమీపములో బిజాపూర్ హైవే పక్కన ఉన్న మర్రి చెట్టు పైకి ఎక్కి నిండు ప్రాణం కోల్పోయిన వ్యక్తి. శుక్రవారం దాదాపుగా సమయం మధ్యాహ్నం 2 గంటలకు కనకమామిడి గ్రామ నివాసి అయిన శివ శంకర్ మర్రి చెట్టు పైన ప్రాణాలు కోల్పోయి పడి ఉండటం పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. శివ కుమారుడు ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి అయిన శివశంకర్ వయస్సు 45 సం, కూలి పని చేసుకుంటూ కనకమామిడి గ్రామ శివారులో కరెంటు షాక్ తగిలి చనిపోయాడు అని పిర్యాదు చేయడం జరిగింది. పిర్యాదుదారు వాళ్ల తల్లిదండ్రులు 15 సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువుకి హిమాయత్ నగర్ నుండి కనకమామిడి గ్రామానికి వచ్చి ఇక్కడే నివసిస్తున్నారు అని తెలిపారు. అయితే శుక్రవారం నాడు ఉదయం పిర్యాదుదారు మరియు అతని తల్లి వారి పనికి వెళ్లిపోయాక, సమయం 1:30 గంటలకి అతని తండ్రికి కనకమామిడి గ్రామ శివారులోని అయాన్ కాలేజీ గేట్ ఎదురుగ ఉన్న మర్రి చెట్టు దగ్గర కరెంటు షాక్ తగిలి చనిపోయాడు అని తెలిసిన వారు కాల్ చేసి చెప్పినారు. అక్కడికి వెళ్లి చుట్టు పక్కల వారి సహాయం తో అతని తండ్రిని కిందకి దింపి చూస్తే అతని చేతిలో మర్రి ఆకులు ఉన్నాయని , అతని తండ్రి మర్రి ఆకుల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు షాక్ తగిలి చనిపోయాడు అని తెలిపారు.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.