Praja Kshetram
తెలంగాణ

పెద్దేముల్ మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ వైన్స్ లో చోరీ.

పెద్దేముల్ మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ వైన్స్ లో చోరీ.

-సుమారు రూ.5 నుంచి 10వేలు తీసుకెళ్లినట్లు వైన్స్ యజమాని వెల్లడి.

-రూ.5 వేల విలువగల మందు బాటిల్ మాయం

పెద్దేముల్ అక్టోబర్ 02(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ వైన్స్ లో నిన్న రాత్రి దొంగతనం జరిగినట్లు వైన్ యజమాని వెల్లడించారు. యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. యధావిధిగా శుక్రవారం ఉదయం 10 గంటలకు వైన్ షాప్ ఓపెన్ చేసి, రోజు మాదిరిగానే రాత్రి 10 గంటలకు బందు చేసి వెళ్లిపోయాము. మరుసటి రోజు శనివారం ఉదయం 10 గంటలకు షాపు ఓపెన్ చేసి చూసే సరికి, షాప్ లో ఉన్న సరుకు మొత్తం చిందరవందరంగా కనిపించింది. దీంతో కాసేపటి వరకు మాకు ఏమీ అర్థం కాలేదు. షాప్ మొత్తం తిరిగి చూసే సరికి షాప్ కు వెనుక భాగంలో ఉన్న కిటికీ యొక్క ఇనుప కడ్డీలను తొలగించుకొని, షాపు లోపటికి ప్రవేశించి, కౌంటర్ దగ్గరికి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు నమోదయింది. ఈ క్రమంలో కౌంటర్లో ఉన్న నగదు రూపాయలు ఐదు నుంచి పదివేల వరకు తీసుకువెళ్లారు. అంతేకాకుండా షాప్ లో ఉన్న మందు బాటిల్లు సుమారు రూ.5 వేలు విలువగల బ్లెండర్ స్ప్రైట్ బాటిల్ లను కూడా తీసుకెళ్లినట్లు షాప్ యజమాని వెల్లడించారు. ఇట్టి విషయాన్ని పోలీసులకు తెలిపామని ఆయన పేర్కొన్నారు.

Related posts