డిఎంజెయు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంద వేణుగోపాల్ గౌడ్
హనుమకొండ నవంబర్ 03 (ప్రజాక్షేత్రం):డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కు చెందిన మంద వేణుగోపాల్ గౌడ్ ను ఆదివారం హనుమకొండ లో నియమించినట్లు డీఎంజేయు వ్యవస్థాపకులు ఎంపల్లి ముత్తేష్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే రాజేంద్రప్రసాద్, బొడ్డు అశోక్,జాతీయ నాయకులు సి ఎస్ రావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు, హక్కుల కోసం పనిచేయాలని సూచించారు.తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.