ప్రమాదవశతత్తూ సుమిత్ర కాటన్ మిల్లులో పత్తి దగ్ధం.
-లక్షల్లో ఆస్తి నష్టం
-ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
పెద్దేముల్ నవంబర్ 07(ప్రజాక్షేత్రం):ప్రమాదవశత్తూ మారేపల్లి సుమిత్ర కాటన్ మిల్లులో పత్తి దగ్ధమైంది. గురువారం సాయంత్రం మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులో గల సుమిత్ర కాటన్ మిల్లులో ప్రమాదవశత్తూ మిల్లులో స్టోర్ చేసిన పత్తి కాలిపోయినట్లు మిల్లు యజమాని ఓ ప్రకటనలో తెలియజేశారు. కాలిన పత్తి విలువ లక్షల్లో నష్టపోయినట్లు వారు వెల్లడించారు. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, వెంటనే ఫైర్ సిబ్బంది వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చినట్లు వారు పేర్కొన్నారు.