Praja Kshetram
తెలంగాణ

ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డీఈవో

ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డీఈవో

మహబూబ్‌నగర్ నవంబర్ 07 (ప్రజాక్షేత్రం):ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ డీఈవో రవీందర్ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధ్యాయుడికి దక్కాల్సిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశాడు. డీఈవో రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్‌ను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు గురువారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రూ.50 వేలు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

Related posts