యువత డ్రగ్స్, గంజాయి కు బానిస కావొద్దు.
-గంజాయి తో యువత చిత్తుకావద్దు.
-కొండాపూర్ సిఐ చంద్రయ్య.
కొండాపూర్ నవంబర్ 07 (ప్రజాక్షేత్రం): యువత సరదాల కొసం వెళ్లి డ్రగ్స్, గంజాయి అలవాటు చేసుకుంటే భవిష్యత్తు నాశనం అవుతుంది అని కొండాపూర్ సిఐ చంద్రయ్య అన్నారు డ్రగ్స్ వాడటం చట్టరీత్యా నేరం అని డ్రగ్స్, మద్యపానం అలవాటు వలన అనారోగ్యలు, కుటుంబాలు ఇబ్బందులో పడుతాయి అని తెలిపారు. డ్రగ్స్, గంజాయి వాడే యువతకు పోలీస్ శాఖ వలన కౌన్సిలింగ్ ఇస్తాము అని అన్నారు. మహనీయులు జీవిత చరిత్రలు చదవడం వలన యువత మంచి మార్గంలో లో నడిచే అవకాశం ఉంటుంది అని కోరారు.యువత చెడు దారిన పడకుండా ఉపయోగపడుతుంది అని అలాగే చదువుకునే యువత డ్రగ్స్, మద్యం వాడకం వలన మంచి భవిష్యత్తులు నాశనం చేసుకుంటున్నారు. అని ఆలోచన విధానాన్ని మార్చుకొని కష్టపడి చదువుకోవాలి అని అన్నారు.అలాగే డ్రగ్స్, గంజాయి వాడినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు.