Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

విస్తృతంగా తెదేపా సభ్యత్వ నమోదు

విస్తృతంగా తెదేపా సభ్యత్వ నమోదు

గాజువాక, నవంబర్ 7(ప్రజాక్షేత్రం):సభ్యత్వ నమోదు ద్వారా కలిగే ప్రయోజనాన్ని ప్రతిఒక్కరికీ వివరించాలని,దీనిని ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.గాజువాక బీసీ రోడ్డు,కాకతీయ కూడలిలో 65 వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.తొలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో పల్లా మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా నిలవాలన్నదే పార్టీ ఉద్దేశ్యం అని అన్నారు.కార్యకర్తల సమిష్టి కృషి వలనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెదేపాకు అఖండ మెజారిటీని అందించారని గుర్తు చేశారు.వాడవాడలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతo చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.అనంతరం అక్కడికి వచ్చిన వారికి సభ్యత్వం ఇచ్చి యాప్ ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు,వార్డు అధ్యక్షులు రట్టి వాసు,కాకి స్వరూపారాణి, కృష్ణ, వేంకటేశ్వర రావు, మంగ, దముడు, సుజాత, జయమ్మ, నాగేశ్వరరావు, కామేశ్వరరావు, ఎల్ వి రమణ, చిన్న, గురుమూర్తి, రాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Related posts