Praja Kshetram
తెలంగాణ

మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న చిన జీయర్ స్వామి

మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న చిన జీయర్ స్వామి

శంకర్‌ పల్లి నవంబర్ 08(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి పదవ వార్డు సింగపురంలో నూతనంగా నిర్మించిన మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి శిఖరాధ్వజ విగ్రహ నాభిశీల (బొడ్రాయి) ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో శుక్రవారం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి పాల్గొన్నారు. ఉదయం వేద పారాయణం గోపూజతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఆవాహిత దేవత పూజలు, అదివాసాంగ హోమాలు ఆవాహిత దేవత హోమాలు, మూల మంత్ర అనుష్టానములు చతుర్వేద పారాయణములు ఘనంగా జరిగాయి. 10 గంటలకు సామూహికంగా అజరిత సహస్రనామ కుంకుమార్చన మహా మంగళహారతి జరిగాయి. అనంతరం బొడ్డు పద్మమ్మ పాపిరెడ్డి దంపతులచే అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి జై ప్రవచనం జరిగింది. పరమహంస పరిబ్రాజకులు త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆగమనం విష్ణు సహస్రనామ పారాయణం స్వామివారి ఆశీరానుగ్రహ భాషను జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ఆ వాహిత దేవత ప్రదోషకాల పూజలు స్వామివారికి ధ్యాన దివాసములు చతుర్వేద స్వస్తి రాజోపచార పూజలు జరిగాయి. రాత్రి భక్త బృందంచే భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లావణ్య శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రాథోడ్, మాజీ జెడ్పిటిసి కళావతి, మాజీ సర్పంచులు మాణిక్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విట్టలయ్య, లచ్చయ్య, ఎల్ మాణిక్య రెడ్డి ప్రజలు పాల్గొన్నారు.

Related posts