రేపు అంబేద్కర్ యూనివర్సిటీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్.. స్పాట్ రిజిస్ట్రేషన్ కొరకు చాన్స్
హైదరాబాద్ నవంబర్ 08 (ప్రజాక్షేత్రం):బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ ఎంట్రెన్స్ పరీక్ష శనివారం నిర్వహించనున్నారు. కాగా ఇప్పటివరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోని విద్యార్థులు హైదరాబాద్ లోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా నేరుగా పరీక్ష రాయొచ్చని స్పష్టంచేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన రిజిస్ట్రేషన్ ఫీజు, ఆధార్ కార్డ్ తో పాటు రెండు ఫొటోలు తీసుకొని రావాలని సూచించారు. ఎంట్రన్స్ పరీక్ష శనివారం మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఐ-సెట్ 2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందొచ్చని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్‌సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు.