Praja Kshetram
తెలంగాణ

నరేడ్లగూడెం అంటే ఎర్రమటి దందా ఈ ఊరంటే మొరం

నరేడ్లగూడెం అంటే ఎర్రమటి దందా ఈ ఊరంటే మొరం

-ఎర్రమట్టి దందా జోరుగా సాగుతున్నాయి

షాబాద్ నవంబర్ 08 (ప్రజాక్షేత్రం):షాబాద్ మండలంలోని నరేడ్లగూడ గ్రామంలో జోరుగా ఎర్రమట్టి, మోరము దందా కొనసాగుతుంటే ఒకవైపు రెవెన్యూ అధికారులు, ఒకవైపు పోలీస్ అధికారులు చూసినట్టుగా వుండి, అధికారులు మామూలు మత్తులో మునిగిపోయారు. గ్రామస్తులు ఎంత చెప్పినా రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయితీ అధికారులు చూసి చూడనట్లు వుంటూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒక బడా నేత ఆధ్వర్యంలో ఈ ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతుందని ఎన్నిసార్లు అధికారులకు,పోలీసు సిబ్బందికి చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో పోలీసులకు అధికారులకు ముడుపులు అందుతున్నాయని అందుకే పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అంటున్నారు. అటు పట్టా, ఇటు సొంత పొలాల్లో రైతులకు మాయమాటలు చెప్పి ఇలాంటి బడా లీడర్ నేతృత్వంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ మైనింగ్ ఎర్రమట్టి దందాలను అరికట్టాలని, ప్రభుత్వ అధికారులు ఇలాంటి నీచమైన సమస్యలకు సహకారం అందించవద్దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts