Praja Kshetram
పాలిటిక్స్

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

 

శంకర్ పల్లి నవంబర్ 08 (ప్రజాక్షేత్రం):చేవెళ్ల నియోజక వర్గం, కొండకల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను చేవెళ్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి మోత్కుపల్లి మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేసి, తమ ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రజా పాలన తీసుకు రావడం కొరకు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యొక్క, నియంత పాలన పైన, చెరగని ఆత్మవిశ్వాసంతో, పది సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ విప్లవాన్ని నడిపించి, చిత్త శుద్ధితో పనిచేసిన నాయకుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షడు మోత్కుపల్లి మహిపాల్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజులలోనే రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, మానవ సామాజిక హక్కులను కాపాడటానికి సమగ్ర కుల గణన కార్యక్రమాన్ని చేపట్టారని దీనివల్ల ప్రజలకు చేరవలసిన ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి సులభతరంగా చేరతాయని మాజీ సర్పంచ్ లావణ్య కాశీనాథ్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలక్ష్మణ్, గ్రామ సర్పంచ్ లావణ్య కాశీనాథ్ గౌడ్, ఏఎంసి డైరెక్టర్ వడ్ల శ్రీహరి,యూత్ ప్రెసిడెంట్ వెంకట్ రాజ్, నాయకులు, యాదయ్య, ఉమాకాంత్, దేవేందర్ రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Related posts