ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు.
పెద్దేముల్ నవంబర్ 08(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంతో, మంబాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతూ అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటిని సకాలంలో నెరవేర్చి మాట నిలబెట్టుకున్న డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు డివై నర్సింలు, ఆనంద చారి, గోపాలకృష్ణ, విద్యాసాగర్, ఏఎంసి మాజీ చైర్మన్ పడగళ్ల బుజ్జమ్మ, పార్టీ కార్యకర్తలు నర్సింలు గౌడ్, కోళ్ల గోపాల్, సాయిబాబా, షబ్బీర్, సంజీవ్, మైపూస్, హర్షవర్ధన్ రెడ్డి, ప్రకాశం, కిరణ్ , యాదయ్య తదితరులు పాల్గొన్నారు.