వారం రోజులుగా నీళ్లు బంద్.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
పెద్దపల్లి నవంబర్ 08 (ప్రజాక్షేత్రం): తెలంగాణలో తాగునీటి కోసం ఆడబిడ్డలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏ పల్లెకు వెళ్లి పలకరించినా కడవల్లా కన్నీళ్లు కారుస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక, కరెంట్ లేక బిందెడు నీళ్ల కోసం మైళ్లదూరం నడిచి పోతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలో వారం రోజులుగా సింగరేణి నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్మికేతర వాడలకు సింగరేణి నీళ్లు ఆపేయడం సరికాదని, యథావిధిగా నీళ్లు ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందంచి మంచినీళ్లు సరఫరా చేయాలని కోరుతున్నారు.