పండుగలా ‘పామేన భీమ్ భరత్’ జన్మదిన వేడుకలు
-సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిని చాటిన కేఎన్ఆర్ టీం
-ఆసుపత్రుల్లో, పాఠశాలలో పండ్లు,గుడ్లు పంపిణి
-సకల దేవుళ్ల ఆశీస్సులతో భీమ్ భరత్ నిండు నూరేండ్లు వర్ధిల్లాలని వేడుకోలు
మొయినాబాద్ నవంబర్ 09 (ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ పామేన భీమ్ భరత్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పండుగలా జరిగాయి. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భీమ్ భరత్ నివాసం కోలాహలంగా మారింది. శుక్రవారం రాత్రి, ఉదయం నుండే శుభాకాంక్షలు చాటెందుకు ప్రజలు పుదీనా దండలతో బారులు తీరగా..కేక్ ను కట్ చేసిన అనంతరం అభిమానులు బాణా సంచా కాల్చారు. భీమ్ భరత్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. భీమ్ భరత్..జన్మదినం వేళ ప్రేమ విందును ఏర్పాటు చేశారు. అయితే చేవెళ్ళ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొట్టం నర్సింహా రెడ్డి (కేఎన్ఆర్)టీం మాత్రం వినుత్నంగా ఉదయం నుండే మొయినాబాద్, చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కేతిరెడ్డిపల్లి ప్రాధమికొన్నత పాఠశాలలో దాదాపు 300 పై చిలుకు వారికి పండ్లు,గుడ్లు పంపిణి చేసి స్ఫూర్తిని చాటి ఆదర్శంగా నిలిచారు.