Praja Kshetram
తెలంగాణ

మరకత ఆంజనేయ ఆలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు

మరకత ఆంజనేయ ఆలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు

 

శంకర్‌ పల్లి నవంబర్ 09 (ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి లోని సింగాపురం పదవ వార్డులో గల మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పట్టణ, వార్డు ప్రజలు స్వామివారి దీవెనలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపీ కోరుకున్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, స్థానిక కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బిజెపి అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, మాజీ జెడ్పిటిసి విట్టలయ్య మున్సిపల్ ఇంచార్జ్ వాసుదేవ్ కన్నా, నాయకులు వెంకట్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, మున్సిపల్ అధ్యక్షులు సురేష్, మాజీ సర్పంచ్ బయన్న, దయాకర్ రెడ్డి, యూత్ అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts