Praja Kshetram
తెలంగాణ

ముగ్గురు పేకాట రాయుళ్ళ అరెస్టు.

ముగ్గురు పేకాట రాయుళ్ళ అరెస్టు.

-నలుగురు పరారైనట్లు పోలీసుల వెల్లడి.

-నిందితుల నుండి 8300 స్వాధీనం.

పెద్దేముల్ నవంబరు 09(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామ శివారులో బహిరంగ స్థలంలో గల గుట్ట దగ్గర ఉన్న ఓ చెట్టు కింద పేకాట ఆడుతున్న వారిలో, నాగులపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. బాలప్ప గారి వీరారెడ్డి, జక్కల శ్రీనివాస్, మట్ట నరసింహులు లను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై గిరి వెల్లడించారు. ఎస్సై గిరి తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపల్లి గ్రామ శివారులోని బహిరంగ స్థలంలో గల చెట్టు కింద పేకాట ఆడుతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు, పోలీసులు దాడి చేయగా మొత్తం ఏడు మంది వ్యక్తులలో ముగ్గురు దొరకగా, మరో నలుగురు పరారైనట్లు ఆయన తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మిగతా నలుగురు.. నర్సాపూర్ గ్రామానికి చెందిన మల్లేశం, గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఈడిగి శ్రీనివాస్, నాగులపల్లి గ్రామానికి చెందిన దాసరి రవి, బోయిని విటల్ ల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకుంటామని అన్నారు. ఈ క్రమంలో నిందితుల నుండి నగదు రూ.8300లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.కాగా నిందితుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Related posts