Praja Kshetram
తెలంగాణ

హాస్టల్ వార్డెన్ పై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు 

హాస్టల్ వార్డెన్ పై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

 

-హాస్టల్ లో అంతా వార్డెన్ రాజ్యమే నేను పెట్టిందే తినాలి అంటూ విద్యార్థులను బెదిరింపు.

-ప్రతిరోజు హాస్టల్లో నీళ్ల పప్పే

-ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్న-వార్డెన్

-హాస్టల్లో పనులన్నీ విద్యార్థులు చేయాలి.

-వారిపై తక్షణమే చర్య తీసుకోవాలి-కలెక్టర్ కు ఫిర్యాదు

నిజామాబాద్ నవంబర్ 11(ప్రజాక్షేత్రం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఉన్న బీసీ ఫ్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ లో చాలా దారుణదుస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు కన్నీళ్లు కారుస్తూ చెబుతుంటే మనసు తళుకుమంటుంది. దేవాలయం లాంటి విద్యాసంస్థలు ఇలా ఉంటే పిల్లలు భవిష్యత్తు నాశనం అయినట్టే….హాస్టల్ వార్డెన్ సమయపాలనికి రావడం లేదు మరియు హాస్టల్లో ఉండడం లేదు పిల్లలకు భోజనంకు సంబంధించి మెనూ ప్రకారం కాక ప్రతిరోజు నీళ్ల పప్పు పెడుతుంది ఇది కూడా నాసిరకంగా నాణ్యత లేకుండా భోజనం పెడుతున్నారు.మరియు పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారు.పిల్లలు వార్డెన్ రూమ్ కి వచ్చి తమ సమస్యను చెప్పుకుంటే చిన్నపిల్లలును అని చూడకుండా కొడుతున్నారు.మరియు పిల్లలతో కూరగాయలు కోయించడం గదులను శుభ్రం చేయడం వంటి పనులను హాస్టల్లో ఉండే వర్కర్లతో కాకుండా విద్యార్థులతో చేపిస్తున్నారు.సాయంత్రం సమయంలో పిల్లలకు ఇవ్వాల్సినటువంటి స్నాక్స్ కూడా ఇవ్వడం లేదు ఆహారం మరియు నాశనం భోజనం గురించి హాస్టల్ వార్డెన్ ను ప్రశ్నించగా మీ పేరెంట్స్ మీ ఇంటి కాడ కూడా తినడానికి తిండి లేక ఈ హాస్టల్లోకి పంపించారు. మీకు ఇది పెట్టడమే ఎక్కువ మేము పెట్టిందే తినాలి అని చిన్నతనంగా చూస్తూ మానసికగా హింసస్తున్నారు. పిల్లలని వార్డెన్ కావున ఇట్టి విషయం పైన సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అలాగే హాస్టల్లో తరచుగా పర్యవేక్షణ చేసి అధికారులు ఏ బి సి డి ఓ కూడా పర్యవేక్షణ హాస్టలను చేయడం లేదు వీళ్ళు పర్యవేక్షణ చేయకపోవడం వలనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా సెక్రెటరీ ద్యాగ శేఖర్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేసి కలెక్టర్ వారిని తక్షణమే చర్య తీసుకోవాలని కోవడం జరిగింది.

Related posts