Praja Kshetram
తెలంగాణ

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో పోటెత్తిన భక్తులు

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో పోటెత్తిన భక్తులు

 

శంకర్‌ పల్లి నవంబర్ 11 (ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి మండల చందిప్ప గ్రామ 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకొని భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి దర్శనం కొరకు క్యూలైన్లో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు సాయిశివ మాట్లాడుతూ కార్తీక మాసం మహాశివునికి పవిత్రమైన రోజులుగా భావిస్తారని, సోమవారం భారీగా భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Related posts