అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్‌పల్లి వాసి
శంకర్ పల్లి నవంబర్ 11 (ప్రజాక్షేత్రం):తెలంగాణ గవర్నమెంట్ టీజిపి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాదులో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ట్రాన్స్ పోర్ట్ భవన్ లో ఏఎంవిఐ నియామక పత్రాన్ని శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్ కి చెందిన మాల కిరణ్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాల బాలయ్య, విజయలలిత, కుటుంబ సభ్యులు రమ్య, శ్రీధర్ బంధుమిత్రులు పెంటయ్య, శంకరయ్య, మర్పల్లి అశోక్, నర్సింలు, రాములు, మాజీ ఎంపీపీ నర్సింహులు, మాజీ సర్పంచ్ బిసోల్ల శ్రీధర్, స్నేహితులు, కాలనీవాసులు అభినందనలు తెలిపారు. గత నెలలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నియామకమై మేడ్చల్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ, మళ్లీ నెల రోజుల వ్యవధిలోనే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా మరో ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తన బిడ్డ పట్టుదలకు, శ్రమకు, వినయ, విధేయతలకు ఎంతగానో గర్వపడుతూ బంధుమిత్రులతో వారి సంతోషాన్ని పంచుకున్నారు.