Praja Kshetram
తెలంగాణ

రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.

రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.

-అనుమతులు తప్పనిసరి.. ఎస్ఐ

పెద్దేముల్ నవంబర్11(ప్రజాక్షేత్రం):ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై గిరి తెలిపారు. సోమవారం పెద్దేముల్ మండల పరిధిలోని “మన్సన్ పల్లి” గ్రామ శివారు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు అక్కడ వెళ్లి చూడగా, ట్రాక్టర్ నెంబర్ AP 07DE5430, “గోపాల్ నాయక్ “మరియు ట్రాక్టర్ నెంబర్ TS 34TA 8583 “మెగావత్ రమేష్” అను వ్యక్తులు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా.. మన్ సంపల్లి వాగులో నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా, ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరి వెల్లడించారు. అనంతరం తాహసిల్దార్ ముందు హాజరు పరచగా,ఎవరైనా ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే, కఠినమైన చర్యలు తీసుకుంటాము అని ఆయన హెచ్చరించారు.

Related posts