102వ ధరూర్ జాతర నేడే ప్రారంభం.
మొదటిరోజు మొదటి ఆరాధనలో పాల్గొన్న బంట్వారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యన్.నర్సిములు..
వికారాబాద్, ప్రతినిధి నవంబర్ 12( ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా దోర్నాల గ్రామ ప్రాంతంలో ఈ యొక్క క్రిస్టియన్ జాతర నిర్వహించబడును. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో నిర్వహించబడుతుంది.ఈరోజు మొదటిరోజు ప్రారంభఆరాధనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు ప్రభువు ప్రార్థనలో పాల్గొనడం జరిగింది.ఈ జాతరకు వందల కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర ద్వారా వస్తారు. క్రిస్టియన్ సోదరులు తమ హృదయాలలో అనుకున్నది జరిగితే ఈ జాతరకు పాదయాత్ర చేస్తారు.ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు కులమత బేధాలు లేకుండా లక్షలాదిమంది తరలివస్తారు మొదటి రోజు నుండి ఐదు రోజుల వరకు గుడారాలు వేసుకుని ప్రార్థన చేసుకుంటూ భజనల ద్వారా పాటలు ద్వారా ఆ యొక్క ప్రభును మహిమ పరుస్తారు. ఈరోజు జాతర కమిటీ వారు జాతరను ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా బంట్వారంమండలం చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింలు, మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సీరా ఇస్సాక్,వెంకటయ్య సుదర్శన్ ఏలియా తదితరులు పాల్గొనడం జరిగింది.