సుప్రీమ్ తీర్పు అమలుచేసి మాదిగలకు న్యాయం చేయాలి
–మంద కుమార్ ఎం ఎస్ పి జాతీయ నేత
గోవిందరావుపేట నవంబర్ 12 (ప్రజాక్షేత్రం):రాష్ట్ర ప్రభుత్వము సుప్రీం కోర్ట్ తీర్పును గౌరవించి అమలుచేసి మాదిగలకు న్యాయం చేయాలని ఎంఎస్ పి జాతీయ నేత మంద కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో ఎం.ఎస్.పి మండల సమావేశం ఎంఎస్ పీ ములుగు జిల్లా అధ్యక్షుడు మడి పెళ్లి శ్యాంబాబు అధ్యక్షతన జరిగినది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి జాతీయ నేత మంద కుమార్, వేల్పుల సూరన్న . బొడ్డు దయాకర్ . ఎం ఆర్ పి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బోర్ర బిక్షపతి లు పాల్గొన్నారు. ముందుగా మంద కుమార్ మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దేశంలోనే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఎస్టీల వర్గీకరణ ప్రకారం విద్య ఉద్యోగ రంగాలలో వర్గీకరణ అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తామని ప్రకటించి ఎస్సీల వర్గీకరణ లేకుండా డి ఎస్ సి టీచర్ ఉద్యోగాలు 11062 అమలు చేసి మాదిగలకు ఆన్యాయం చేసి మాదిగలు అబివృద్ధి చెందకుండా మోసం చేయడం జరిగింది వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గౌ మంద కృష్ణ నాయకత్వం లో డిసెంబర్ 21 న హైదరాబాద్ లో మాదిగల ధర్మ యుద్ధ మహా సభ ను నిర్వహిస్తున్నాం. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హలో మాదిగ. చలో హైదరాబాద్ డిసెంబర్ 21న మాదిగల ధర్మ యుద్ధ మహా సభ ను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బర్రి సతీష్ ఎమ్మెస్పీ జాతీయ నాయకులు ఇరుగు పైడి ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు పుల్లూరి కర్ణకర్ . ఎంఎస్ఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షుడు పేరాల బలరాం. అనంతరం మండలం కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటించారు.