Praja Kshetram
తెలంగాణ

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం చర్యలు..పలువురిపై వేటు

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం చర్యలు..పలువురిపై వేటు

 

ఆసిఫాబాద్ నవంబర్ 13 (ప్రజాక్షేత్రం):గురుకుల ఆశ్రమ పాఠశాల లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. మంచిర్యాలలోని సాయి కుంట గిరిజన ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం.గంగారం ను సస్పెండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పై అధికారులకు సమాచారం ఇవ్వని కారణంగా గంగారంపై సస్పెన్షన్ వేటు వేసినట్లుగా పేర్కొన్నారు. అటు ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వంట సమయంలో తీసుకోవాల్సిన మేర జాగ్రత్తలు తీసుకొని కారణంగా కుక్ హరికృష్ణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కమల, పెంటయ్య లను బదిలీ చేస్తూ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. సరైన పర్యవేక్షణ చేయలేదనే కారణంతో హెడ్మాస్టర్ డి. శ్రీనివాస్, ఏఎన్ఎం వి.సేవంతను బదిలీ చేశారు. ఘటనపై విచారణ కమిటీ నివేదిక ఆధారంగా వాంకిడి ఆశ్రమ పాఠశాల సిబ్బంది బదిలీ వేటు వేశారు.

Related posts