Praja Kshetram
తెలంగాణ

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. డిఎంహెచ్ఓ

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. డిఎంహెచ్ఓ

 

-ఓపి సేవలు ఇంకా మెరుగుపడాలి.

-ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలి.

-పాము కాటు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉండేలా చూడాలి.

పెద్దేముల్ నవంబర్ 13(ప్రజాక్షేత్రం):ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య అధికారి(డిఎంహెచ్ఓ) “వెంకటరావణ” డాక్టర్లకు సూచించారు. బుధవారం సాధారణ విధుల్లో భాగంగా,జిల్లా వైద్య అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో, పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో పలు రికార్డులను పరిశీలించి, నిత్యం ఎంతమంది రోగులు వస్తారు, ఏ వ్యాధులకు సంబంధించి ఎంతమంది వస్తున్నారో… వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రక్త నమూనా సేకరణ గదిని, ఫార్మా గదిని తనిఖీ చేసి, నిత్యం రక్త పరీక్షలు జరిగేలా చూడాలని, కాలం చెల్లిన మందులు ఆసుపత్రి నుండి తొలగించేలా చూడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసుపత్రిలో ఓపి సేవలు మరింత మెరుగుపడేలా కృషి చేయాలని ఆయన సూచించారు. మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా సిబ్బంది సమయానికి ఆసుపత్రికి చేరుకొని, రోగులకు అందుబాటులో ఉండే విధంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎవరైనా ప్రమాదవశత్తూ.. పాము కాటుకు, కుక్క కాటుకు గురైనట్లయితే వాళ్లకు సరియైన చికిత్సను అందించేందుకు ఎల్లప్పుడూ మందులు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పల్లె దావాఖానలో నిత్యం వైద్యులు వండే విధంగా చూసుకోవాలని డాక్టర్లు.. బుచ్చిబాబు, వెంకట సాయి లకు సూచించారు. ఈ సందర్భంలో నిరుపయోగంగా ఉన్న పాత ఆసుపత్రిని తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి వెంకట రావణ, డిఐఓ & డిడిఓ డాక్టర్ బుచ్చిబాబు, మండల వైద్యాధికా రి వెంకట సాయి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts