Praja Kshetram
తెలంగాణ

రేషన్ బియ్యం లో పురుగులు.

రేషన్ బియ్యం లో పురుగులు.

-శంకర్ పల్లి మండలం సంకేపల్లి గ్రామంలో ఘటన.

-తిరిగి పంపిస్తా అంటున్న డీలర్ గాలయ్య.

శంకర్ పల్లి నవంబర్ 13 (ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం సంకేపల్లి గ్రామంలో రేషన్ బియ్యంలో పురుగులు వచ్చాయి. ఇది గమనించిన గ్రామస్తులు ఈ బియ్యాన్ని ఎలా తినాలి అని రేషన్ బియ్యం అందించే డీలర్ గాలయ్యను ప్రశ్నించగా ఆయన బియ్యం పైనుంచి ఇలాగే వచ్చాయి అని, మునుపెన్నడు ఇలా జరగలేదు అని, ఈ బియ్యాన్ని తిరిగి పంపించి వీటి స్థానంలో మంచి బియ్యన్ని ఇస్తాను అని అన్నారు. అయితే గ్రామస్తులు మాత్రం రేషన్ బియ్యం అంటేనే పేద మధ్య తరగతి తినేవి అని ప్రభుత్వం మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుని నాణ్యమైన బియ్యాన్ని అందించాలి అని అన్నారు.

Related posts