కులగనన సర్వేలో మాకు న్యాయం చేయండి.
నిజామాబాద్ నవంబర్ 14(ప్రజాక్షేత్రం):ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జిల్లా కమిటీ అధ్యక్షులు సుంకరవల్లి సాయన్న ఆధ్వర్యంలో డివిజన్ అధికారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో చేపూర్,వేల్పూర్,మోతే,కలిగోట్, తోల్రికొండ, అమీనాపూర్,కొత్తపల్లి గ్రామాలలో నిజమైన గోసంగిలో ఉన్నారు.మిగతా గ్రామాలలో బేడ బుడగ జంగానికి సంబంధించిన వారు. వాళ్లు నిజమైన గోసంగిలు కారు అని తెలియజేయునైనది. వారు ఇప్పుడు జరగబోయే కులగనన లో బేడ బుడగ జంగం కులము పేరు వ్రాయించుకోవాలి ఉన్నారు.ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మండలాలకు ఆర్డిఓ ద్వారా డి సి ఎస్ సి కమిటీ కొరకు లేక ద్వారా నివేదికను పంపించామని కావున సమస్త తాసిల్దార్ లో త్వరగా పంపిస్తే డి సి ఎస్ సి కమిటీ ఏర్పాటు అవుతుందని ఉన్నారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకరపల్లి సాయన్న, అధ్యక్షులు మల్లెల సాయిచరణ్,ప్రధాన కార్యదర్శి అంకంపల్లి మోహన్, సుదర్శన్, ధర్మపురి, ప్రచార కార్యదర్శి అంకంపల్లి వెంకట్, మల్లేష్, నర్సయ్య, శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.