నేటి బాలలే రేపటి పౌరులు.
-పిల్లల ఉన్నత చదువులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరి.
పెద్దేముల్ నవంబర్ 14(ప్రజాక్షేత్రం):నేటి బాలలే రేపటి పౌరులు, విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమని శ్రీవాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ అన్నారు. గురువారం శ్రీవాణి ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులకు వివిధ రకాల ఆట పోటీలు నిర్వహించి విద్యార్థులను ఉత్తేజపరిచారు. అనంతరం వ్యాసరచన పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఆయన చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించాలని సూచించారు. నెహ్రుకు చిన్నపిల్లలు అంటే ఎంతో ప్రేమ అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.