Praja Kshetram
పాలిటిక్స్

ఆర్మూర్ లో కాంగ్రెస్ బిజెపి మధ్య రగడ

ఆర్మూర్ లో కాంగ్రెస్ బిజెపి మధ్య రగడ

-రెండు పార్టీల మధ్య రచ్చ రచ్చ..

-కాంగ్రెస్ బిజెపి మధ్య ఫ్లెక్సీ వివాదం..

-నువ్వా నేనా అంటూ తోపూసులాట..

-ప్రోటోకాల్ లేదని ఇరు పార్టీల మధ్య ఘర్షణ..

నిజామాబాద్ నవంబర్14(ప్రజాక్షేత్రం):ఆర్మూర్ లోని పెర్కిట్ మున్సిపల్ పరిధిలోని వడ్ల కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్,ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడం కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకునంది. బీజేపీ నాయకులు ఫ్లెక్సీ లను సైతం చింపి వేశారు. కాంగ్రెస్ బిజెపి మధ్య రగడ మీరు పార్టీల మధ్య తోపులాట అయ్యింది. దీన్ని గమనించిన కమిషనర్ పోలీసులు ఇరు పార్టీ కార్యకర్తలను సందాయించడంతో ప్రశాంతత నెలకొంది. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.గొడవ సర్దుమనిగి ప్రశాంతత నెలకొంది.

Related posts