Praja Kshetram
తెలంగాణ

పరిగి సబ్ జైల్లో రైతులను పరామర్శించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

పరిగి సబ్ జైల్లో రైతులను పరామర్శించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

 

వికారాబాద్‌ నవంబర్ 14 (ప్రజాక్షేత్రం):లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరోవైపు లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ పగ ప్రతీకారంతో పట్నంను కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మీకు ఓటేస్తే మేలు జరుగుతుం దనుకుంటే పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్‌పై సైతం కుట్రలు చేస్తున్నారని.. ఆ రోజు మల్లన్నసాగర్‌లో నీ మీద కేసులు పెట్టినమా అంటూ సీఎం రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించామని.. నరేందర్ రెడ్డికి ఏ సంబంధం లేదన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తెలియదని.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడానికి ఒక్క నిముషం ముందు ఒత్తిడి చేసి నరేందర్‌రెడ్డితో సంతకం చేయించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బడాబాబులపై ప్రేమ ఉందన్నారు. నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని.. ఆయనకు బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందన్నారు. ధర్మమే గెలుస్తుందని.. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.

Related posts