Praja Kshetram
తెలంగాణ

ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే రేవంత్ రెడ్డి రాజకీయ పతనం ఖాయం.

ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే రేవంత్ రెడ్డి రాజకీయ పతనం ఖాయం.

-మాదిగలది ధర్మ పోరాటం, మాలలది అధర్మ పోరాటం.

-ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ.

రాజేంద్ర నగర్ నవంబర్ 15 (ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురాకుండా మోసం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ పతనం ఖాయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్, ఎం ఎస్ పి రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగలు అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్,ఎం ఎస్ పి మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం బద్వేల్ లోని అరుంధతి కమ్యూనిటీ హల్ లో పెంటనోళ్ళ నరసింహా మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ, ఇంజం వెంకటస్వామి మాదిగలు మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగానే దేశంలో మొట్ట మొదట స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండానే 11062 టిచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశాడని అన్నారు. రేవంత్ రెడ్డి మాలల ఒత్తిడికి తలొగ్గి కావాలనే ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్నారని అన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు పునాదిగా నిలబడిన మాదిగలను దూరం చేసుకుంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా పతనం కాకతప్పదని అన్నారు. వెంటనే సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం పోరాటం తప్ప మాదిగలకు మరో దారి లేదని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా మాలలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయడం దుర్మార్గం అని అన్నారు. మాదిగల తమకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం ధర్మ పోరాటం చేస్తుంటే మాదిగలకు న్యాయం దక్కకూడదని కుట్రబుద్ధితో మాలలు అధర్మ పోరాటం చేస్తున్నారని అన్నారు. అయినా ధర్మం గెలిచి తీరుతుందని, ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని మాదిగలు నమ్ముతున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మరో పోరాటానికి సిద్ధం కావడానికి ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి మరియు అనుబంధ సంఘాలకు గ్రామ, మండల నూతన కమిటీలను ఏర్పాటు చేసుకొని నిర్మాణం పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కళమండలి అధ్యక్షులు ఎన్ వై అశోక్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు రావుగళ్ల బాబు మాదిగ, ఎం ఎస్ పి సీనియర్ నాయకులు మద్దిలేటి మాదిగ, క్యాసారం శంకర్ రావు మాదిగ, ఎం ఎస్ పి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కేశపగా రాంచందర్ మాదిగ, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి భైరపోగు శివకుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పంగ ప్రణయ్ మాదిగ, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మాదిగ, ఎం ఇ ఎఫ్ సీనియర్ నాయకులూ పోతురాజు యాదన్న, ఎమ్మార్పీఎస్ స్టేట్ సెక్రటరీలు ప్రశాంత్ మాదిగ, సిద్దులు మాదిగ, రామచందర్ మాదిగ, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భాను మాదిగ, వికారాబాద్ జిల్లా కన్వీనర్ శివాజీ మాదిగ, ప్రవీణ్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Related posts