Praja Kshetram
తెలంగాణ

అంగరంగ వైభవంగా శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహా స్వామి రథోత్సవము

అంగరంగ వైభవంగా శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహా స్వామి రథోత్సవము

 

-గోవింద నామస్మరణతో మార్మోగిన లింబాద్రిగుట్ట

-రథోత్సవాన్ని (జాతర)ను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

-భక్తుల జయ జయ ద్వానాల మధ్య రథ భ్రమనము

భీంగల్ నవంబర్ 15(ప్రజాక్షేత్రం): నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట పైన శ్రీ లక్ష్మీ నృసింహాస్వామి(జాతర) రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నంబి పార్థసారథి,విజయ సారధిలు ఘనంగా నిర్వహించారు.శ్రీ లక్ష్మీ నృసింహాస్వామి జాతర ను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా,ఇతర రాష్ట్రాలు,జిల్లాల నుండి వేలాది భక్తులు రథ భ్రమనాన్ని(జాతర)ను కనులారా వీక్షించడానికి రావడం జరిగింది.కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు జాతరకు వచ్చిన భక్తులు ఉదయాన్నే మొదలు గర్భాలయంలో ఉన్న మూలవరులను క్యూలైన్ ద్వారా ఓపికతో దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జాతరకు సిద్ధంగా ఉన్న రథానికి రంగులతో మెరుగులు దిద్ది,భక్తులు తీసుకు వచ్చిన బంతిపూల తొట్లేలను రథానికి కట్టి అందంగా అలంకరించారు.శరీరము రథమే,విశ్వము రథమే అన్న భావనతో ఇవన్నీ మనము చూడలేము కాబట్టి ఒక ప్రతిమ రూపకంగా ఉన్న రథములో స్వామిని తీసుకొని పోయి స్వామి నువ్వు మా లోపల ఎప్పుడూ ఉన్నావు నిన్ను ఈ రథములో చూసుకుంటున్నాము అన్న భావనతో సంపూర్ణమైన రథ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ఆలయంలో కూడా సాధారణంగా రథోత్సవము ఉంటుంది కానీ నూతన రథ ప్రతిష్ట ప్రతి సంవత్సరం చేయరు. లింబాద్రిగుట్ట ప్రత్యేకం ఏమంటే ప్రతిసారి ఆ రథమును కొత్త రథం అనుకొని దానికి సంపూర్ణ నూతన రథ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు.వేద పండితులు వాసు ప్రవచనంతో,అర్చకుల మంత్రోచ్ఛారణతో,మేళ తాళాలు,భాజా భజంత్రీల,భక్తుల జయ జయద్వనాల నడుమ రథ భ్రమణాన్ని నిర్వహించారు. భక్తుల కోరిక కోరికలు తీర్చే కొంగు బంగారమైన స్వామి రథ భ్రమణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్మూర్ ఏసిపి ఆధ్వర్యంలో భీంగల్ సీఐ నవీన్ కుమార్,ఎస్సై జి.మహేష్ భారీ బందోబస్తు నిర్వహించారు. లింబాద్రిగుట్టకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చిన భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.జాతరలో ప్రత్యేక ఆకర్షణగా, వినోదాన్ని కలిగించే ముఖ్యంగా పిల్లలకు,యువతీ, యువకులకు మొదట గుర్తుకు వచ్చే సర్కస్,పెద్ద జాయింట్ వీల్ లేకపోవడంతో వినోదాన్ని కోల్పోయామని తెలిపారు. ప్రత్యేకంగా స్త్రీలకు, వృద్ధులకు, ఆడపిల్లలకు మొబైల్ టాయిలెట్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతరకు వచ్చిన జనాలు త్రాగునీటి కోసం,ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.జాతరలో వెలసిన దుకాణాలు ఎక్కువగా రాలేవన్నారు. జాతరకు వచ్చిన ప్రజలు చిన్న చిన్న దేవస్థానాలు ఎండోమెంట్లో ఉన్నాయని,రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహాస్వామి దేవస్థానం ఎండోమెంట్ లో పడకపోవడం వచ్చిన భక్తులకు ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపారు. లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా కాంగ్రెస్ నేతలు టీజీఎండిసి చైర్మన్ ఈరవత్రి అనిల్,రాష్ట్ర సహకార సంఘం చైర్మన్, డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడు ప్రజలపై ఉండాలని వేడుకున్నారు. లింబాద్రి శ్రీ లక్ష్మి నృసింహాస్వామి రథోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని వేడుకున్నారు.

Related posts