ఉద్యోగస్తులు ఏకతాటిపై ఉండి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి
-సంగారెడ్డి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జావిద్ అలీ
సంగారెడ్డి నవంబర్ 17 (ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫోరం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా తెలంగాణ జయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జావీద్ అలీ హాజరై సభను నిర్వహించారు. ఆయన ఉద్యోగుల సమస్యలపై తన దృష్టిని సారించి, సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తమ తమ సమస్యలను వివరించారు.ఉద్యోగుల విన్నపాలను ఆలకించిన జావీద్ అలీ, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చి, “సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఐక్యతగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని అందరూ కలిసి పనిచేసినప్పుడే సమస్యల పరిష్కారానికి గట్టి భరోసా ఉంటుంది” అని పేర్కొన్నారు.
సమావేశంలో ఉద్యోగుల సమస్యలైన పదోన్నతులు, పదవీవిరమణ పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేస్తామని, సంఘ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని నేతలు కోరారు. ఈ సమావేశంలో టిఎన్జీవో కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశం, యాదవ్ రెడ్డి, ఇంటర్మీడియట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు ఆరిఫ్, సందీప్, ప్రవీణ్ నాయక్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.