తండ్రి భౌతిక కాయం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న నారా రోహిత్.. ఓదార్చిన చంద్రబాబు
హైదరాబాద్ నవంబర్ 16 (ప్రజాక్షేత్రం):ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు సోదరుడు, నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో శనివారం మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తినాయుడు మృతి చెందారు. అంత్యక్రియల కోసం ఆయన భౌతిక కాయాన్ని చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆసుపత్రిలోని రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తరలించేందుకు ఆయన తనయుడు నారా రోహిత్‌తో కలిసి సీఎం చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తండ్రి భౌతిక కాయాన్ని చూసి నారా రోహిత్ కన్నీళ్లు పెట్టుకోగా ఆయనను చంద్రబాబు ఓదార్చారు.