Praja Kshetram
తెలంగాణ

డిజిటల్ మీడియా ప్రజల పక్షాన నిలబడాలి

డిజిటల్ మీడియా ప్రజల పక్షాన నిలబడాలి

 

-ప్రజల్లో ఉమ్మడి రాజకీయ చైతన్యాన్ని పెంచాలి

-డీఎంజేయూ ఆవిర్భావ సభలో ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి

-మహబూబాబాద్ లో ఆవిర్భావ సభ,జెండా ఆవిష్కరణ

మహబూబాబాద్ నవంబర్ 17(ప్రజాక్షేత్రం):డిజిటల్ మీడియా ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల బతుకు జీవితాలను వెలికి తీయాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుప్రభ కాన్ఫరెన్స్ హాల్లో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ (డి ఎం జే యూ) జెండా ఆవిష్కరణ ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి చేయగా అనంతరం ఆవిర్భావ సభ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరి, కరుణాకర్ రెడ్డి లు మాట్లాడుతూ… మీడియా అంటే గుత్తాధిపత్యం లో నడుస్తున్న వ్యవస్థ అని దానికి భిన్నంగా సోషల్ మీడియా కామన్ మ్యాన్ సామాన్యుల జీవితాలను చూపించాలన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. జర్నలిజంకి కేంద్ర బిందువు విమర్శాత్మకమైనటువంటి ఆలోచనే పేదోడి గొంతుకగా డిజిటల్ మీడియా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానుకోట సీనియర్ జర్నలిస్టు కల్లూరి ప్రభాకర్, యూనియన్ వ్యవస్థాపకులు ఎంపెల్లి ముత్తేష్, జాతీయ గౌరవాధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్ర ప్రసాద్, జాతీయ నేత చందా శ్రీనివాస్(సిఎస్ రావు), ఆంధ్రప్రదేశ్ నాయకులు సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య, కేతోజు వెంకటాచారి, మంద వేణుగోపాల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కర్ణ కుమార్,గుడాల సునీల్ చంద్ర, రాష్ట్ర నాయకులు యార సాంబయ్య, స్థానిక నాయకులు లక్ష్మయ్య, అమీర్, యాకాంతం, కిషన్ రావు, శ్రీనివాస్, నరేందర్ తోపాటు ఆయా జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts