Praja Kshetram
తెలంగాణ

రోడ్లపైనే బతుకులు.. గిరాకీ లేక వ్యధలు

రోడ్లపైనే బతుకులు.. గిరాకీ లేక వ్యధలు

 

మద్నూర్ నవంబర్ 17 (ప్రజాక్షేత్రం):మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో చెప్పులు కుట్టే మోచి కులస్తుల బతుకులు రోడ్లపైనే కొనసాగుతున్నాయి. గిరాకి వస్తే పాత చెప్పులకు రూ.10 వస్తాయి. లేదంటే దినమంతా ఎండలో గిరాకీ కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో ఎవరో ఒకరు పాత చెప్పు కొట్టుమని వస్తే రూ.10 తీసుకుంటామని అంటున్నారు. ఇలాంటి గిరాకులు దినమంత కూర్చుంటే ఎప్పుడో ఒకరోజు రూ.100 నుండి రూ.200 కష్టానికి లభిస్తాయని తెలిపారు. లేదంటే దినమంతా ఖాళీగా కూర్చుని ఇంటికి వెళ్లవలసిన దుస్థితి ఉంటుందని వాపోయారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, ఒకచోట చిన్నపాటి దుకాణాలు వేసుకొని అక్కడే చెప్పులు కుట్టే వృత్తి చేసుకుందామంటే ఒకప్పుడు ఉన్న తమ దుకాణాలను తొలగించారని అన్నారు. ఇక మా బతుకులు రోడ్లపైనే పాత చెప్పులు కొట్టుకునే పరిస్థితి తప్ప వేరే దారి లేదన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం మమ్ములను ఆదుకోవాలని వేడుకున్నారు.

Related posts