Praja Kshetram
తెలంగాణ

శంకర్ పల్లి మాజీ ఎంపిటిసి బొమ్మన్న గారి కృష్ణ మొదటి వర్ధంతి నిర్వహించిన కుటుంబ సభ్యులు…

శంకర్ పల్లి మాజీ ఎంపిటిసి బొమ్మన్న గారి కృష్ణ మొదటి వర్ధంతి నిర్వహించిన కుటుంబ సభ్యులు…

 

శంకర్ పల్లి నవంబర్ 19(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మాజీ ఎంపీటీసీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కురుమ సంఘం మాజీ సెక్రెటరీ, శంకర్ పల్లి మహాత్మ జ్యోతిరావు పూలే వ్యవస్థాపక అధ్యక్షులు, శంకర్ పల్లి మండల బిసి ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, ఎన్ టి పి సి భూ బాధితుల సంఘం అధ్యక్షులు, పటాన్చెరు వెంకటకృష్ణ కాంటా వెజిటబుల్ మార్కెట్ అధినేత, బొమ్మన గారి కృష్ణ ప్రథమ వర్ధంతిని కుటుంబ సభ్యులు శంకర్ పల్లి లో గల మనీ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ క్రమశిక్షణ ఊపిరిగా, కష్టమే ఇష్టంగా నిరాడంబతరమే ఆలంబనగా చెరగని నవ్వుతూ ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎల్లప్పుడూ సమాజ హితం కోసం పరితపిస్తూ అందరి హృదయలలో మంచి పేరు సంపాదించుకున్న కీర్తిశేషులు బొమ్మను గారి కృష్ణ మా నుండి మీరు భౌతికంగా దూరమైన నేటితో ఒక సంవత్సరం గడిచిన మీ మధుర స్మృతులు మా మదిలో ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంటాయని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా కుటుంబం యొక్క పెద్దదిక్కు అయినటువంటి బొమ్మనగారి కృష్ణ భౌతికంగా మాకు లేకున్నా కానీ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని అదేవిధంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను అని ముందుండే వ్యక్తి బొమ్మనగారి కృష్ణ అని వాళ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ భానూరి వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉదయ మోహన్ రెడ్డి, అన్ని పార్టీల నేతలు, కీర్తిశేషులు బొమ్మన్న గారి కృష్ణకుటుంబ సభ్యులు జైపాల్ యాదవ్, వీరేశం యాదవ్, పాండు యాదవ్, విట్టల్ యాదవ్, ప్రభు యాదవ్, బొమ్మన్నగారి కృష్ణ కుమారులు అయినటువంటి అజయ్ యాదవ్, తదితర బొమ్మన్న గారి కృష్ణ కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు పాల్గొన్నారు.

Related posts