చీటర్ దీపక్ రెడ్డి తో సహా మరో వ్యక్తి రిమాండ్ కు తరలింపు.
-ఇటీవల కాలంలో స్టూడెంట్ ను అడ్డుపెట్టుకొని మోసాలకు పాల్పడ్డ దీపక్ రెడ్డి.
పెద్దేముల్ నవంబర్ 19(ప్రజాక్షేత్రం):చీటర్ దీపక్ రెడ్డి మరియు ఇమ్రాన్ లను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు పెదేముల్ ఎస్సై గిరి తెలిపారు. ఎస్సై గిరి తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ స్టూడెంట్ ను వేధిస్తున్నారని,వారిపై కేసు పెట్టకుండా చూసేందుకు, మీడియాలో పత్రికలలో వారి పేర్లు రాయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసి,2.50 లక్షల రూపాయలు తీసుకున్న కేసులోని ప్రధాన నిందితులు A1) దీపక్ రెడ్డి (USFI విద్యార్థి నాయకుడు, A5) ఇమ్రాన్ లను పెద్దేముల్ పోలీస్ వారు తేదీ 19/11/2024 నాడు అరెస్టు చేసి వారి నుండి 14,000/- రూపాయలు మరియు రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని జుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది అని ఎస్సై గిరి వెల్లడించారు. అదేవిధంగా ఇదే కేసు విషయమై ఇతర నిందితులుగా రుజువు అయిన
A2) గౌన్ (నమస్తే తెలరాగాణ రిపోర్టర్),
A3) ముకుంద్ రెడ్డి ( సాక్షి రిపోర్టర్),
A4) లక్ష్మారెడ్డి (ఆంధప్రభ రిపోర్టర్) లు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.ఇట్టి కేసులో నిందితులు అయిన విలేకరులపైనా మరియు USFI విద్యార్థి నాయకుడు పైన జిల్లా కల్లెక్టర్ మరియు ఆయా శాఖల అధికారులకు సమాచారం పంపించడం జరిగిందని ఎస్ఐ గిరి వెల్లడించారు.ఈ సందర్భంలో ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎంత మంది ఉన్నారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు, బెదిరుపులకు ఎవరైనా పాల్పడితే,ఇలాంటి వ్యక్తుల ద్వారా ఎవరైనా మోసపోయినటువంటి బాధితులు ఉంటే గనుక పోలీస్ లను సంప్రదించాలని, ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై గిరి మాట్లాడుతూ..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరు అయినా కూడా సహించేది లేదంటూ హెచ్చరించారు.