దోమల నివారణ యంత్రం సెక్రటరీ కి అందించినా గ్రామ యువకులు.
శంకర్ పల్లి నవంబర్ 20(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల కేంద్రము ఇరుకుంట్ల గ్రామ యువకులు సహృదయంతో దోమల నివారణ యంత్రము అందించిన వారిని గ్రామ పంచాయతీ సెక్రటరీ ధన్యవాదాలు తెలియజేస్తూ యువతను అభినందించారు. ఇలాంటి సేవాభావాలు గ్రామ పంచాయతీకి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతాయని కొనియాడారు. యంత్రం అందించిన వారిలో ప్రత్యేకంగా రమేష్ నాయక్ మండల కాంగ్రేస్ పార్టీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు కి గ్రామా ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువతలు పాల్గొన్నారు.