రైతుల సంక్షేమమే లక్ష్యం
-చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
-దామరిగిద్ద, సర్దార్‌నగర్‌లో పత్తి, వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
చేవెళ్ల/షాబాద్, నవంబరు 21(ప్రజాక్షేత్రం):రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల మండల పరిధిలోని దామరిగిద్దలో ఉన్న శ్రీనివాస కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలని సూచించారు. దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, టీజీపీసీబీ సభ్యుడు సత్యనారాయణరెడ్డి, చేవెళ్ల మార్కెట్ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి.రాములు, ఏవో శంకర్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, మాజీ సర్పంచ్ లావణ్య శంకర్, డైరెక్టర్లు మల్లేష్, నరేందర్, రాములు, జనార్దన్, కాంగ్రెస్ చేవెళ్ల మండలాధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి మహేందర్, సీసీఐ మేనేజర్ రాజు, పత్తి మిల్లు కంపెనీ చైర్మన్ రమేశ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. అలాగే షాబాద్ మండల పరిధిలోని సర్దార్‌నగర్ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. డీసీఎమ్మెస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీసీబీ సభ్యుడు సత్యనారాయణరెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, డీసీఎమ్మెస్ బిజినెస్ మేనేజర్ వెంకట్‌రెడ్డి, నాయకులు రాంరెడ్డి, రవీందర్ నాయక్, ఆంజనేయులుగౌడ్, మల్లేష్, సుభాష్ రెడ్డి, నర్సింలు, జంగయ్య, మల్లేష్, అధికారులు సురేశ్‌బాబు, సుజాత, లిఖిత, మనోహర్‌రెడ్డి ఉన్నారు.