మాదిగలను దూరం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి రాజకీయ పరాభవం తప్పదు.
-ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాలలకు కొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డి.
– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ.
మంచిర్యాల నవంబర్ 21(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణను దేశంలో మేమే ముందు అమలులోకి తీసుకువస్తామని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకోకుండా మాదిగ జాతికి ఘోరంగా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ,MSP రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగలు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్,MSP మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిర్మల్ పట్టణంలోని PRTU భవన్ లో బొబ్బిలి శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ ,ఇంజం వెంకటస్వామి మాదిగలు మాట్లాడుతూ ” రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చెందిన మాల ప్రజాప్రతినిధులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని అన్నారు.సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా తీర్పు ఇచ్చిన రోజు దాన్ని స్వాగతించి ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణను వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని అన్నారు.కానీ దాని విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ లేకుండానే 11062 టిచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు రేవంత్ రెడ్డి ఘోరమైన ద్రోహం చేశాడని అన్నారు. మాలలకు కొమ్ముకాస్తున్న రేవంత్ రెడ్డి మాదిగలను దూరం చేసుకుంటున్నాడని అన్నారు.ఇకనైనా రేవంత్ రెడ్డి తన విధానాలని మార్చుకొని తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలను దూరం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి రాజకీయ పరాభవం తప్పద అని అన్నారు.ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం తప్ప మరే మార్గం లేదని,కాబట్టి మాదిగలంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అందుకోసం MRPS MSP మరియు అనుబంధ సంఘాలకు క్షేత్రస్థాయిలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MSP నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంబేకర్ సాయి చంద్ మాదిగ , MSF జాతీయ కార్యదర్శి బిక్కి మురళికృష్ణ మాదిగ , MSP రాష్ట్ర నాయకులు బాలేకర్ నంద కుమార్ మాదిగ, శనిగారపు రవి మాదిగ , MRPS ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఆరేళ్లి మల్లేష్ మాదిగ , చెన్నూరు సమ్మయ్య మాదిగ, కొండ్రు బ్రహ్మయ్య మాదిగ, MSP మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాల్వ శరత్ మాదిగ మరియు నిర్మల్ జిల్లా నాయకులు కత్తి నవీన్ మాదిగ, నల్లూరి అరుణ్ కుమార్ మాదిగ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.