సింగూరు చౌరస్తాలో బ్రిడ్జి నిర్మించాలి
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించాలి
-కాశపాగ ఇమ్మయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు
సంగారెడ్డి జిల్లా నవంబర్ 24 (ప్రజాక్షేత్రం):చౌటకూర్ మండల పరిధిలోని విలేకరుల సమావేశంలో ఇన్మయ్య మాట్లాడుతు తాడ్దాన్ పల్లి చౌరస్తా వద్ద బ్రిడ్జి నిర్మించాలని గతంలో అనేక మార్లు ఉమ్మడి పుల్కాల్ మండలం లోని అన్ని గ్రామాల ప్రజలు గతంలో రోడ్లపై ధర్నాలు చేసి ఇక్కడ బ్రిడ్జి నిర్మిచాలని పలు మార్లు వివిధ పద్ధతులలో నిరసనలు చేశారు. అయినా జాతీయ రహదారి సంస్థ నిమ్మకునీరేత్తిన విదగా వ్యవహారిస్తూ కాలం వెళ్ళాదిశారు. అప్పుడున్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి పుల్కల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన సంగతిని అయన గుర్తు చేస్తూ అప్పుడు ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి కేంద్ర మాత్రులకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి పుల్కల్ మండలంలోని మెజారిటీ గ్రామలైన 18 గ్రామాలు మరియు తండా వాసులు వివిధ కార్యక్రమాల నిమిత్తం ప్రతిరోజు వేల మంది ప్రభుత్వ ప్రైవేటు పనుల నిమిత్తం అలాగే జీవనోపాధి కొరకు ప్రతిరోజు సంగారెడ్డికి రావాల్సి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వస్తు పోతున్న సందర్భలలో రోడ్డు దాటుతుండగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు దామోదర్ రాజనర్సింహ రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం మీ చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా తాడ్ధన్ పల్లి చౌరస్తా లో బిర్జిని నిర్మించాలి అలాగే సుల్తాన్ పూర్ చెక్రియల్ గ్రామం లో కూడా బిర్జి నిర్మించి ఉమ్మడి పుల్కల్ మండల ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.