Praja Kshetram
తెలంగాణ

మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క ..

మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క ..

 

తాడ్వాయి నవంబర్ 24(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మానవత్వం చాటుకున్నారు. దారిన పోయేవారు తన కళ్లెదుటే ప్రమాదాన్ని గురి కావడం చూసి ఆమె తన వాహనం ఆపి వారిని దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి క్షతగాత్రులను తక్షణ వైద్యం అందించడానికి సిబ్బంది రెడీగా ఉండాలని సూచించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం చిన్న బోయినపల్లి రహదారిపై ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైనాడు. ఆమె చిన్న బోయినపల్లి కొన్ని ప్రారంభోత్సవాలకు వెళ్తున్న క్రమంలో ఇక్కడ రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఆమె గుర్తించి తన వాహనాన్ని ఆపారు. శత గాత్రుని హుటాహుటిన వారి కాంగ్రెస్ బృందం సహకారంతో, ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. దారిన పోయే వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటే, క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా మారేదని సామాన్యుల పట్ల మంత్రి సీతక్క మానవత్వం చాడుకోవడం పై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Related posts