మా ఇల్లు బఫర్ జోన్లో లేదు : క్లారిటీ ఇచ్చిన రంగనాథ్
హైదరాబాద్ నవంబర్ 24(ప్రజాక్షేత్రం):తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. మధురానగర్లో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో అబద్దం అని ఖండించారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారని.. 44 ఏళ్ల కిందటే మా నాన్న ఈ ఇంటిని నిర్మించారని వివరించారు. చెరువు కట్టకు 10మీ దాటితే బఫర్ జోన్ కిందికి రాదని, తమ ఇళ్ళు పార్కుకు కిలోమీటర్ దూరంలో ఉందని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.