శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం నవంబర్ 24 (ప్రజాక్షేత్రం):శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులతో పాటు కార్తీక మాసం ముగుస్తుండటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రం కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు వాహనాల రద్దీ పెరిగింది. శ్రీశైలం టోల్ గేట్, సాక్షి గణపతి, హఠకేశ్వరం ముఖద్వారం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. అయినా ట్రాఫిక్ మరింతగా పెరుగుతోంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి భారీగా తరలివస్తున్నారు. ఈ రోడ్‌లో సోమవారం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి, వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యేక టీములతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.