రోడ్డుపైనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారి
పెద్దపల్లి నవంబర్ 25(ప్రజాక్షేత్రం):రూ. 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఓ బిల్లు విషయంలో కాంట్రాక్టర్‌ను నుంచి ఏఈ నర్సింగరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేదిలేక సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్టర్ రూ.20 వేలు అందజేశారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. అలాగే నీటిపారుదల శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.